Friday 19 September 2008

చర్చల సమాహారం - ప్రమదావనం

ఈ ఆదివారం 21 - 9 - 2008 నాడు సాయంత్రం ఐదు గంటలకు ప్రమదావనం సమావేశం ఉంటుంది. సభ్యులందరికీ ఇదే ఆహ్వానం. ఇంతవరకు చేరని మహిళా బ్లాగర్లకు కూడా ఆహ్వానం . నాకు మెయిల్ చేస్తే ఎంట్రీ పాస్ ఇస్తాను.

jyothivalaboju@gmail.కం


చర్చకు కొన్ని అంశాలు.

ముదితల్ నేర్వగరాని విద్య కలదే అన్నట్టు ఈ రోజు వనితలు చేరని రంగం ఏదైనా ఉందా? ఇంట్లో చేసే పచ్చళ్ళ నుండి అంతరిక్షంలో పరిశోధనల వరకు ఎంతో ఎదిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. అలాంటి వివిధరంగాలలో ఉన్న మహిళల గురించి ముచ్చట్లు (సోది) చెప్పుకుందామా?

తల్లితండ్రులు పిల్లలతో స్నేహితుల్లా ఉండాలని అందరూ అనుకుంటారు. కాని నేటి ఉద్యోగినులకు తమ పిల్లలతో గడపడానికి ఎక్కువ సమయం దొరకడంలేదు. అలాంటప్పుడు ఆ లోటు ఎలా తీర్చుకోగలరు?

ఇంకా మీకు ఇష్టమైన అంశం ఏదైనా చర్చించుకోవచ్చు.

వచ్చేయండి మరి.

12 వ్యాఖ్యలు:

విరజాజి

జ్యొతి గారూ,

మీ ప్రమదావనానికి రావాలని నేను బ్లాగ్ మొదలు పెట్టినప్పటినుంచీ అనుకుంటున్నాను. కాకుంటే, మీ ఆహ్వానం చాలాసార్లు ఆలస్యంగా చూడడం వల్ల రాలేకపోయాను. మీ ఎంట్రీ పాసు నా మెయిలు కి పంపండి.

సుజాత వేల్పూరి

సోదా? నేను రెడీ! రమణి గారు కూడా వస్తున్నారుగా?

Sujata M

నాకు కరెంట్ షాక్, ఇంటెర్నెట్ షాక్ లేక పోతే వచ్చి.. టైమౌట్ అయిపోకుండా గోల పెట్టేస్తా.. కానీ నాదొక టాపిక్ ఉంది. జ్యోతి గారికి మైల్ చేస్తా. సీక్రెట్ కాదు గానీ ఆ టాపిక్ ఎలాంటిదంటే, ప్రమదలందరూ నన్నో వెర్రిమాలోకం అనుకోవచ్చని.. కొంచెం.. ఇది.

Ramani Rao

సుజాత గారు: సోది అనగానే "రమణీ గారు వస్తున్నారా?" అని అడగడం ఏమి బాగోలేదండి అయినా మీరలా అడిగారని మీమీద అభిమానంతో వచ్చానా! సోది అనేసరికి చాట్ రూం కూడ నావల్ల కాదని మొహం చాటేసింది, ఏంటీ సోది గోల అంటూ..

Anonymous

plamadaaa vanam eppulu aadivaalamenaaaa jyothi gaaalu :(:(:(

సుజాత వేల్పూరి

రమణి గారు,
నాకూ అలాగే జరిగింది నిన్న! తర్వాత ఏడున్నరకి వచ్చి చూస్తే ఎవరూ లేరు.

మొదట నాతో పాటు మాటలు పడింది మీరు, జ్యోతి గారే కదా అని మిమ్మల్ని కూడా కలుపుకున్నానంతే! మనది సోదో కాదో తేలిపోయిందిగా...!

జ్యోతి

సుజాత, రమణి

శాంతించండి.. మనం సోది చెప్పుకుంటామో, సినిమా స్టోరీ చెప్పుకుంటామో అది మనిష్టం.

లచ్చిమి..

బుజ్జితల్లి, అవునమ్మా! ఆడవాళ్లందరు ఆదివారమే కలుస్తాము. ఎందుకంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారుగా మరి. నువ్వు వచ్చేయ్ మరి.
నాకు ఉత్తలమ్ లాస్తే నీకు ఎంత్లీ పాస్ ఇస్తా..

Anonymous
This comment has been removed by the author.
Anonymous

jyothakkkayi andalooo mimmalni alaage pilutttaaalu gaaaaa
nenu jyothi gaalu ani piluddam anukunnaaa kaaani tethulika (maa amma :):) ) "gaalu " anaku baaledu annaalu anduke
valasa kalipesaaaa
meeko maaata cheppanaaa
evallitonooo cheppakooladem
chepte mee jattu peech peech
chepppeettttunnaaa

naaku aadivaalam kudaladu laavadam
naaku aadivaalam MS classes vuntaayi
sanivaalam kooodaa kudaladu
anduke aligaaa only aadivaalam ye naa ani em chettaam maa adlustam inte ani salipettukuntaaam :(:(:(

జ్యోతి

లచ్చిమి..

పర్లేదు తల్లి. నాకొక మెయిల్ చేయి. నిన్ను ప్రమదావనం గుంపులో చేరుస్తాను . అందులో ఏరోజైనా మాట్లాడుకోవచ్చు. అవును నువ్వు ఇంఅ చిన్నపిల్లవి కదా MS క్లాసులో ఎవరు చేర్చుకున్నారు??

ప్లీజ్.. నువ్వు ఇంగ్లీషు లేదా తెలుగులో రాయి. ఈ సంకర తెలుగు చదవడానికి చిరాకేస్తుంది..

అల్దం చేసుకోవాలి అమ్మలు పెద్దాళ్లు చెప్పింది..

Anonymous

సలే సలే అలాగే
అప్పులయ్యినా నన్ను ఏమనకూలదు మలి సలేనా?

MS means-Master of stories :):)

అంటే కథలు చెప్తా అన్నమాటా:):)
మలి కథలు చెప్పాలి అంటే నన్నేమనకూలదు
అంటే నే ఏలుత్తా మలి చిన్నపిల్లని ఏలిపించకూలదు కదా
మీలు చెప్పినట్టే తెలుగు లో లాయడం నేల్చుకున్నా
నేను మంచి పిల్లని కదా
ఇక నుంచి అంతా తెలుగే
మలి మీకు e- ఉత్తలం పంపించాలంటే మీ e- చిలునామ కావలి కదా
అది ఎలా తెలిసేను చెప్మా !!!!

జ్యోతి

లచ్చిమి.
నా చిరునామా ఎన్నోసార్లు ఇచ్చాను.మళ్లీ ఇస్తున్నా ..

jyothivalaboju@gmail.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008