Saturday 31 January 2009

ఆడాళ్ళూ మీకు జోహార్లు



నా స్నేహితుడు ఈ మధ్య పరిశోధన చేసి పి.హెచ్.డి. తీసుకున్నాడని తెలిసి అతనిని కలిసా. అతను అ.భా.భా.బా. సంఘం సెక్రటరీ అంట, మన విహారి లాగా. అతను తీసుకున్న విషయం ఏంటంటే “భార్యామణులతో బాధలు”. అతని ప్రొఫెసర్ కూడా బాధితుడే కాబట్టి రెండు నెలల్లో డాక్టరేట్ పుచ్చుకున్నాడు. అతని పరిశోధనలో రాసిన కొన్ని విషయాలు నిజమే అనిపించింది. అవి ఇక్కడ ఇస్తున్నాను. ఈ ప్రశ్నలకు వాళ్ళు ఎవో సమాధానాలతో తమను తాము సర్దిచెప్పుకున్నారు. నేను మన పాఠకులు ఏమంటారో అని ప్రశ్నలుగానే ఇచ్చా. మగాళ్ళందరూ ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నందుకు ఇది చదివి గంతులెయ్యండి. పండగ చేసుకోండి.


*. ఆడవాళ్ళు కొంటె పని చేస్తే సరదాగా చేసారంటారు. అదే మగవారు చేస్తే ఏదో ఉందనే అంటారు . ఈ భేదం ఎందుకు?


*. జుట్టును కొత్త స్టయిల్‍లో వేసుకున్నారు. సరే. ఇంకా అద్దంలో అటూ ఇటూ చూడటమెందుకు?


*. పెళ్ళిలో ఒకసారి వేసుకున్న డ్రెస్ ఇంకొకళ్ళ పెళ్ళిలో ఎందుకు వేసుకోరు?


*. బీరువానిండా బట్టలున్నాయి. అయినా ఏదీ కట్టుకోవడానికి మనసొప్పదు. ఎందుచేత?


*. శాస్త్రీయ సంగీతం, మోడర్న్ ఆర్ట్స్ గురించి తెలియనప్పటికీ ‘వాహ్వా, వాహ్వా’ అనడం ఎందుకు?


*. ఇంట్లో ఎన్నో బకెట్లున్నా, ఫ్రీగా దొరికే బకెట్ లేదన్న బాధ ఎందుకు?


*. పర్సులో పెట్టుకోవడానికి ఏమీ లేకపోయినా భుజానికి తగిలించుకుని వెళ్ళడం ఎందుకు?


*. చక్కగా తయారై ఇంటి నుంచి బయటికి వెళ్ళేముందు అత్తతో ” అత్తయ్యా ! మా అమ్మదగ్గరికి వెళ్ళి రానా?” అని కోడలు ఎందుకు అడుగుతుంది?


*. “ఏవండి! నేను చాలా రోజులుగా పుట్టింటికి వెళ్ళడం లేదని అందరూ అడుగుతున్నారు. నేనేం చెయ్యను?” అని భార్య ఎందుకు అడుగుతుంది?


*. పాలగిన్నెలో పాలు తీసి మిగిలిన మీగడను కూడా ఎందుకు తీస్తుంది?


*. రోడ్డుపై నడిచేటప్పుడు భర్త చేయి ఎందుకు పట్టుకుంటుంది? చేయి పట్టుకుని కూడా అడుగులో అడుగేస్తూ ఎందుకు నడుస్తుంది?


*. ఆడవాళ్ళ అలవాట్లు గురించి అడిగినప్పుడు కానీ, ‘ఆంటీ ‘ అని పిలిచినప్పుడు కానీ ఎందుకు కోప్పడుతుంది?


*. వేడి వేడి టీ తీసుకుని, చల్లారాక తాగుతుంది. ఇలా ఎందుకు చేస్తుంది?


*. తాను అందంగా ఉన్నానన్న విషయం రోజూ వినాలని ఎందుకనుకుంటుంది?


*. వంట చేసిన ప్రతిసారీ ‘ఎలా ఉంది?’ అని ఎందుకు అడుగుతుంది?


*. నాలుగు నెలలపాటు కప్‍బోర్డును సామాన్లతో నింపుతుంది. ఆ తరువాత అవన్నీ పాత సామాన్లవాడికి వచ్చిన ధరకు అమ్మేస్తుంది. ఇలా ఎందుకు చేస్తుంది?


*. దీపావళి వస్తుందనగానే ఇంటిలోని ప్రతిమూల, గోడలు, బూజులు అన్నీ శుభ్రం చేస్తుంది. ప్రతీ రోజూ శుభ్రం చేయవద్దని ఎవరైనా చెప్పారా?


*. ఇంట్లో పిల్లలని ఎత్తుకుంటుంది. మార్కెట్‍కుగానీ, రోడ్డుపైకి వెళ్ళినప్పుడుగానీ భర్త చేతికి పిల్లలను ఎందుకు ఇస్తుంది?


*. పాలను మరిగించడానికి పొయ్యి మీద గిన్నెను పెట్టి అక్కడే నిలబడి, తీరా పాలు మరుగుతున్నప్పుడు వేరే పని ఎందుకు చేస్తుంది?


*. మాటి మాటికి అద్దంలో మొహం చూసుకోవడమెందుకు? మొహం మారిపోయిందనా ?


*. పుట్టింటివాళ్ళు రాగానే కూరలు ఎందుకు బాగా రుచిగా వండుతారు? అన్నం ఎందుకు మాడిపోదు ?


*. మాట్లాడకుండా కూర్చుంటే మాట్లాడమని అంటుంది. మాట్లాడుతుంటే నోరు మూసుకోమంటుంది . ఎక్కువగా కోప్పడితే కోపం తెచ్చుకుంటుంది. ఎక్కువగా ప్రేమిస్తే అనుమానిస్తుంది . ఎందుకు?


*. పొరుగింటివాడిని గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతుండగా చూసి, భర్తపై ఓ కన్నేసి ఉంచడంలోని అర్ధం ఏమిటి?


*. తన భర్త పేరు చెప్పి బయట అందరిని భయపెడుతూ ఆ భర్తనే ఇంట్లో భయపెట్టడం ఎందుకు?


*. భర్త జీతం మాత్రం మొత్తం కావాలి. పనిని మాత్రం కుటుంబంలో అందరూ పంచుకోవాలి . ఎందుకు?


గతంలో పొద్దులో ప్రచురింపబడింది.. మళ్ళీ మీకోసం..

8 వ్యాఖ్యలు:

Ramani Rao

too funny :)

సుభద్ర

ayyoo inni unnaya cheyataaniki.......
teliyaledee inni rojulu.

Srinivas

ఏంటి ఇప్పుడు వీటన్నింటికీ సమాధానాలు వ్రాసి పంపాలా, పంపాలంటే నిదానంగా, బెదురుతూ మా శ్రీమతిని అడుగుతా.

Unknown

మీరే సమాధానాలు కూడా చెప్పేయకూడదూ.ఇంట్లో ఆడాళ్ళ నడిగితే మా రహస్యాలన్నీ మీకెలా చెపుతాం? అంటున్నారు.ఆలోచించి -- చించి బుర్ర పాడయే లాగుంది.

Siri

జ్యోతి గారు,

ఏమిటండి ఇది. అందరు ఆడవాళ్ళు ఒకేలా వుంటారని మీ అభిప్రాయమా?(అదేలెండి మీ స్నేహితుడి అభిప్రాయమా?) మీరు రాసిన వాటిలో కొన్ని చదివి ఎందుకు మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం అనిపించింది.
శాస్త్రీయ సంగీతం, మోడర్న్ ఆర్ట్స్ గురించి తెలియనప్పటికీ ‘వాహ్వా, వాహ్వా’ అనడం ఎందుకు?
అంటే ఆడవాళ్ళకు ఏమి తెలీదని మీ అభిప్రాయమా?
పర్సులో పెట్టుకోవడానికి ఏమీ లేకపోయినా భుజానికి తగిలించుకుని వెళ్ళడం ఎందుకు?
ఉద్యోగాలు చేస్తున్న ఈరోజుల్లో కూడా పర్సులో పెట్టుకోవడానికి ఏమి వుండదంటారా?
“ఏవండి! నేను చాలా రోజులుగా పుట్టింటికి వెళ్ళడం లేదని అందరూ అడుగుతున్నారు. నేనేం చెయ్యను?” అని భార్య ఎందుకు అడుగుతుంది
మీ దృష్తిలో అందరు ఆడవాళ్ళు పుట్టింటికి వెల్తాం అని చెప్పకుండా ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడతారా?
ఆడవాళ్ళ అలవాట్లు గురించి అడిగినప్పుడు కానీ, ‘ఆంటీ ‘ అని పిలిచినప్పుడు కానీ ఎందుకు కోప్పడుతుంది?
అందరు ఆడవాళ్ళు ఇలాగే వుంటారా?
వేడి వేడి టీ తీసుకుని, చల్లారాక తాగుతుంది. ఇలా ఎందుకు చేస్తుంది?
టీ చల్లారాక తాగడానికి ఆడా మగ తేడా ఏమిటండి?
దీపావళి వస్తుందనగానే ఇంటిలోని ప్రతిమూల, గోడలు, బూజులు అన్నీ శుభ్రం చేస్తుంది. ప్రతీ రోజూ శుభ్రం చేయవద్దని ఎవరైనా చెప్పారా?
అంటే మీ దృష్టిలో అందరి ఇళ్ళు రోజూ అపరిశుభ్రంగా ఉండి ఒక్క దీపావళి రఒజు మాత్రమే శుభ్రపడుతుందంటారా?
భర్త జీతం మాత్రం మొత్తం కావాలి
ఆడవాళ్ళు కేవలం భర్త తెచ్చే జీతం కోసమే ఎదురుచూస్తూ వుంటారా?

మీరు ఆడవాళ్ళు అందరూ ఇంతే అని పరిశోధించి తేల్చి చెప్పిన సత్యం అన్నట్టు రాసారు కాబట్టి నేను ఈ వ్యాఖ్య రాయాల్సి వచ్చింది. ఎందుకంటే నేనూ ఒక మహిళనే, నన్ను ఇలా తక్కువ చేసి, మీరందరూ ఇంతే అన్నట్టు మాట్లాడితే నాకు నచ్చదు కాబట్టి.

జ్యోతి

స్నేహగారు,

శాంతించండి.. ఇది ఒక భార్యాబాధితుడి కష్టాలు.అలాంటి ఆడవాళ్లను కొందరిని నేనూ చూసానులెండి. అందరూ అలా ఉంటారని అనలేదే....

మధురవాణి

జ్యోతి గారూ..
భలే సరదాగా ఉంది మీ టపా..
ఇదే టైపులో మగవారి గురించి కూడా ఓ రీసెర్చి ఆర్టికల్ రాసెయ్యండి :))

పిచ్చోడు

హహ్హహ్హాహ్హ...... హమ్మో పెళ్ళి చేసుకొనేటప్పుడు ఈ లిస్ట్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేసుకొంటా. జ్యోతక్కా చాలా థాంక్స్ :-)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008