Thursday 25 June 2009

చదువు (కొందామా) కుందామా?

జూన్ వచ్చేసింది. స్కూళ్ళు తెరిచేశారు. ఐతే ఎంటంట.. ప్రతి ఏడాది జరిగేదేగా.

ఈసారి ఒక వింత చెప్తాను. తల్లితండ్రులు ఈ ఫీజులు భరించలేము, మేము చదువు కొనలేము అని ఆగ్రహావేశాలు వెలిబుచ్చుతున్నారు. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ళలో ఫీజులు విపరీతంగా పెంచేశారు. ఫీజు కాక సదుపాయాలు అని అదనపు వడ్డింపులు.. రెట్టింపు కాదు మూడింతలు నాలుగింతల ఫీజు పెంచేశారు. ఈ ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం దయ తలిచి ఒక కమిటీ వేసింది. ఈ బాధిత తల్లితండ్రులు ఆ కమిటీ ముందు భోరు మన్నారు. ఆగ్రహించారు. .. విద్యాశాఖను జాడించి ఉతికేసారు. అధికారులు ఎం చెప్తారు. సైలెంట్..

ఇక ఈ పెద్ద స్కూళ్ళ ఫీజుల ధరవరలు ఎలా ఉన్నాయంటే.. ఎల్.కే.జి కి దాదాపు 85 వేలు , పుస్తకాలకే 11 వేలు, ఇక డ్రస్సులు, , బూట్లు కూడా స్కూల్లోనే కొనాలి. స్కూలు వారిచే సదుపాయాలు అంటే.. అన్ని క్లాసుల్లో ఏ.సి , మినరల్ వాటర్, బస్సు కూడా ఏ.సి. కంప్యూటర్లు. ఇలా ఎన్నో ఎన్నెన్నో. మరి వాటికి డబ్బులు మనమే కట్టాలిగా. దినదినం ధరలు పెరుగుతున్నాయి. ఫీజులు పెంచకుంటే స్కూలు వాళ్లు బ్రతికేది ఎలా.

దీనికి కారణం ఎవరు?? అన్ని వేలు, లక్షలు కట్టి చదివిస్తే కాని చదువు రాదా? వాళ్ళు చెప్పేది ప్రత్యేకమైన చదువా?? సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వచ్చే జీతల ధీమాతో తల్లితండ్రులే ఈ స్కూళ్ళను పెంచి పోషిస్తున్నారు. డబ్బుంది కదా అని తమ పిల్లలకు చిన్నప్పటినుండే హైటెక్ సదుపాయాలు ఇవాలనుకున్నారు. ఒక కే.జి పిల్లాడికి ఏడాదికి తక్కువలో లక్ష కట్టాల్సిందే. నేలజీతాలే లక్షల్లో ఉంటే ఈ ఫీజులో లెక్కా? పైగా తల్లితండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలను చూసుకోవడానికి, చదివించడానికి వారికి తీరిక లేదు. సో .. డబ్బులు కట్టి ఆ భాద్యతలు స్కూలు వారిపై వేసేస్తున్నారు. ఇపుడు ఆర్ధిక మాంద్యం వల్ల అందరికి డబ్బులకు కటకటగా ఉంది. ఇంతకూ ముందు లెక్కలోకి రాని స్కూలు ఫీజులు ఇపుడు భారమైనాయి. సంపాదనకు అలవాటు పది చదువును ఒక వ్యాపారం లా మార్చిన యాజమాన్యం వారు ఫీజులు పెంచుతున్నారు. వారికి కావలసింది డబ్బు., లాభాలు. ఎవరెలా పొతే వారికేంటి.. ఇంతకు ముందు కూడా ఇంగ్లీషు మీడియం, కాన్వెంట్ స్కూళ్ళు ఉన్నాయి. కాని చదువు కూడా హైటెక్ కావాల్సి వచ్చింది. అందుకే ఈ హైటెక్, కార్పోరేట్ స్కూలు వెలిసాయి. మూడు ఫీజులు, ఆరు డొనేషన్లు లా దినదినాభివృద్ధి చెందాయి. ఇపుడు వాటిని భరించలేకపోతున్నారా ?? దీనికి కారణం తల్లితండ్రులు. వాళ్లు మారాలి ముందు. ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుతుంటే ఊరుకున్నారు. ఇపుడు ఊరుకోక తప్పదు. లేదా దానికి పరిష్కారం వెతకాలి. అసలు ఐదో తరగతి నుండే ఐ.ఐ.టి కోచింగా ??? పొద్దున్న ఆరుగంటలకు వెళితే ఇంటికొచ్చేసరికి రాత్రి ఎనిమిది. వాళ్ళను దింపడానికి తల్లితండ్రులు కూడా కష్టపడుతున్నారు. అసలు తల్లితండ్రులనే పరిక్షలు రాయమంటే సరిపోతుంది. ఈ తల్లితండ్రికైనా తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. దానికి ఆ పిల్లల బాల్యాన్ని బలి పెడుతున్నారు. కాలేజి పిల్లల బ్రతుకు కూడా అలాగే ఉంది. రెండు మూడు కాలేజీలే తప్ప మిగతావి పనికిరాకుండా పోయాయి. వాళ్ళేమో బాగా చదివే పిల్లల మీద ఎక్కువ శ్రద్ద తీసుకుని ర్యాంకులోచ్చాయోచ్ అని డప్పు కొట్టుకుంటున్నారు. దానితో వల్ల వ్యాపారం ఇంకా అభివృద్ది చెందుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి చోటా వ్యాపారమే.. దీనికి అంతం లేదా..

ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి విజయాలు ఎందుకుండవు. అసలు అవి అసలు కళ్ళకు కూడా కనపడవెందుకు. అక్కడ చదివించే పుస్తకాలు సిలబస్ వేరేనా.. కాదె.. కార్పోరేట్ స్కూళ్ళలో పెట్టె ఫీజుల్లో సగం పెట్టి మంచి అధ్యాపకులను పెట్టి తమ పిల్లలను అక్కడ చదివించలేరా. ఆ చదువుకు ప్రభుత్వ గుర్తింపు ఉండదా.. పదో క్లాసు పరీక్ష రాయనివ్వరా .. అదేం లేదే.. పెద్ద చదువులు చదివి , ఉద్యోగాలు లేనివారెందరో ఉన్నారు. ప్రభుత్వం తో మాట్లాడి తల్లితండ్రులే ఈ విషయంలో ముందడుగు వేయాలి. తమకు కానీ ఖర్చు లేదంటే ప్రభుత్వం ఎందుకు నో అంటుంది.

ఇది చాలా చీప్ గా ఉందా.. ఐతే మీ ఇష్టం. మా బాబుకు ఇరవై ఏళ్ళ క్రింద ఒక పెద్ద స్కూలులో (పేరు గొప్ప ఊరు దిబ్బ అని తర్వాత తెలిసింది) ఎల్.కేజీ కోసం యాభై వేలు అడిగారు. ఒక స్కూలులో నలభై వేలు.. నేనివ్వను అని మామూలు స్కూలులో డొనేషన్ లేకుండా చేర్పించాను. ఇచ్చేవాడుంటేనే కదా తీసుకునేవాడికి ఆశ పెరిగేది.. ఆ తర్వాత మనను దోచుకునేది.. :)

10 వ్యాఖ్యలు:

Srujana Ramanujan

అవును. ఇచ్చేవాడుంటేనేగా దోచుకునేది.

మరువం ఉష

జ్యోతి, మీరు చూపిన సమస్యకి నా వద్ద సమాధానం లేదు. అది ఈనాటిదీ కాదు, మూలాలు లోతుగా పాతుకుపోయిన సమస్యది. కానీ అ రెండో పార్శ్వాన్ని మురళీ గారు ఇక్కడ చర్చించారు http://nemalikannu.blogspot.com/2009/06/blog-post_12.html ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ కూడా ప్రైవేట్ దాదాపుగా ఒకే మాదిరిగావుంటాయి నేను చూసినంతలో. నా పిల్లలు పబ్లిక్ స్కూల్స్లోనే చదువుతున్నారు. అక్కడి సమస్యకి దాని ప్రభావం పడే తల్లితండ్రులే పరిస్కారం వెదుక్కోవాలి.

శ్రుతి

ప్రభుత్వ స్కూల్ లో చదువు రాదని ఎవరన్నారు. నేను చదువుకున్నది అక్కడే మరి. కాని చదువు చెప్పేవారే లేరు. మీరు అన్నట్లు మనం జీతాలిచ్చినా వాళ్ళ వ్యాపారాలు వదిలి చదువు చెప్పేవారు లేరు. కాని మీరు చెప్పిన మాటలు మాత్రం ఒప్పుకోవలసినవే సుమా!

తలితండ్రులిద్దరూ కష్టపడితేనే సాధారణ జీవితం గడపగలుగు తున్నారు. ఇక ఇంటి దగ్గర ఉండి పిల్లలను పట్టించుకునే సమయమేది?

Unknown

meeru chepindhi aksharaala nijam.chinna salahaa prabhutva pathasaalalo pillalini enduku chadivinchakoodadu ani kodaa alochinchaali.nijaniki prabhutva pathasaalallo upadhyayulukanna private upadhyayula medhassu thakkuva.private pathasalallo variki antha medhasse vunte sunaysamgaa aidu ankela jeetham iche prabhutva pathasaala upadhyaya postulaki enduku select kaaru?..ikkada select kaani vaare akkada pani chestharu

జ్యోతి

శృతిగారు, నేను చెప్పేది అదే. ఈ కార్పొరేట్ స్కూల్లు, కాలేజీలే లోకం కాదు. అక్కడ పెట్టే డబ్బు సగం ప్రభుత్వ పాఠశాలలో పెడితే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొవచ్చు. తెలివితేటలు ఉండి చదువుకోలేని పిల్లలున్నారు. చదువు చెప్పే టీచర్లు ఉన్నారు.. వాళ్లకు ఉపయోగం ఉంటుంది ఎంతోమందికి సాయం, జీవనోపాధి ఇచ్చినట్టు ఉంటుందిగా. మనమే కదా ఈ చదువు వ్యాపారులను పోషస్తున్నది. మన పిల్లలకు కావలసింది చదువు, సంస్కారం ... హైటెక్ సదుపాయాలు కాదు...

Anonymous

మావూరికి పోయిన ఏడాదే హై స్కూల్ వచ్చింది. ఈ సంవత్సరం పదోతరగతి లో ఒక విధ్యార్ధికి 540 మర్కులు వచ్చ్హయి .500 దాటి వచ్చినవాళ్ళు ఇంకో నలుగురున్నారు. గవర్న్మెంట్ స్కూల్ కాబట్టి ఆ మర్కులు వచ్చినవాళ్ళకి గుర్తింపులేదు .

పరిమళం

మొదట తల్లితండ్రుల్లో మార్పు వస్తే గానీ వ్యవస్థ మారదు .అప్పటి వరకూ చదువు'కొన'వలసిందే !

హరే కృష్ణ

అనాలిసిస్ బాగా చేసారు
నేను అయితే ప్రభుత్వ పాఠశాల లోనే చదివాను
ఒక స్పష్టమైన లక్షం ని సాధించడానికి సహకారం లభిస్తే (తల్లితండ్రుల నుండి కాని అధ్యాపకుల నుండి )
విజయం సాధించడం కష్టం కాదు
కే.జి కే ఇంత వెచ్చిస్తే వాళ్ళు చదివిన చదవక పోయినా ఇంజనీర్ డాక్టర్ అవ్వడం పెద్ద కష్టం కాదు (నాణ్యత ?)
పేదవాడు పెదవాడి గానే మిగిలిపోతున్నాడు

కొత్త పాళీ

well said.

David

విద్యారంగం వ్యాపార మయమైపొయే వరకు మనమందరం చూస్తూ ఉరుకున్నాము.ఇప్పుడు మనపిల్లలను చదివించడానికి కష్టమయ్యేసరికి తెలిసొస్తూంది. నేటికి అభివృద్ది చెందిన దేశాలలో కామన్ స్కూల్ విదానం ఉంది దానిని మనమందరం డిమండ్ చేయాలి. అప్పుడే ఈ ఫీజుల మోత లేకుండ పోతుంది. అంతవరకు ఈ భారం తప్పదు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008