Sunday 27 December 2009

ఎందుకు? ఏమిటి? ఎలా??


ఎందుకు? ఏమిటి? ఎలా? ఈ డైలాగు వినగానే మీకు ఎవరు గుర్తొస్తారో నాకు తెలుసు? కాని నేను అడిగేది వేరు. గత రెండు మూడు నెలలుగా ఎంతో మంది బ్లాగర్లు తమ బ్లాగు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఒకసారి గత స్మృతులను నెమరేసుకుంటున్నారు. బహు బాగు. ఎలాగూ ఈ సంవత్సరం ఐపోవచ్సింది. ఒక్కసారి మన బ్లాగు అనుభవాలు, అనుభూతులు గట్రా మాట్లాడుకుందామా? ఐతే..

మీరు బ్లాగు ఎందుకు మొదలెట్టారు?

బ్లాగు రాయడం వల్ల మీరు నేర్చుకున్నది ఏమిటి?

బ్లాగు వల్ల ఎలా లాభపడ్డారు? బాధపడ్డారు?

ఇలా మీరు బ్లాగు మొదలెట్టినప్పటినుండి బ్లాగు ఏ ఉద్దేశ్యంతో మొదలెట్టారు. అది నెరవేరిందా.. మీ బ్లాగు గురించి మీరు ఏమనుకుంటున్నారు. దాన్ని ఎలా తీర్చి దిద్దాలనుకుంటున్నారు వగైరా చెప్పండి. ఇది చెప్పడానికి బ్లాగు మొదలెట్టి సంవత్సరాలే కానక్కరలేదు. నెల రోజుల క్రింద ప్రారంభించినవారు కూడా తమ అనుభవాలు రాయొచ్చు. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పొచ్చు. ఒక్కటి మాత్రం నిజం. ఇక్కడ అంటే తెలుగు బ్లాగ్లోకంలో సాయం అడిగితే తప్పక అందుతుంది. నేను అలా అడిగి నేర్చుకున్నదాన్నే. అడగందే అమ్మైనా పెట్టదు మరి..

14 వ్యాఖ్యలు:

SRRao

జ్యోతి గారూ !
మంచి ఆలోచన. ఆత్మవిమర్శ ఎప్పుడూ మంచిదే ! అది ఇలా మిత్రులతో పంచుకోవడం వలన మనం వెడుతున్న మార్గం సరైనదో, కాదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక నా విషయం.
* కొన్ని సంవత్సరాలుగా నేను సేకరిస్తున్న పుస్తకాలు, పత్రికలలోని విషయాలను పదిమందికీ పంచాలని, ఇప్పటివరకూ ఇతరులను మెప్పించి రచయితనవ్వాలనే ఆసక్తి లేకపోవడంతో నాలోనే దాచుకున్న భావాలను వ్యక్తీకరించడానికి, అలా వ్యక్తీకరించే స్వేచ్చకు బ్లాగు వేదిక అని భావించడం వలన ప్రారంభించాను.
* బ్లాగు రాయడం వలన నా రాతలు కొంతమందికైనా నచ్చుతున్నాయని, మన దగ్గరున్న విశేషాలను మన దగ్గరే సమాధి చెయ్యడం కంటే పదిమందికీ పంచడంలోనే ఆనందం ఉంటుందనే విషయం నేర్చుకున్నాను.
* బ్లాగు ప్రారంభించి నాలుగు నెలలు మాత్రమే పూర్తయినా, కొంతమంది మంచి మిత్రుల్ని సంపాదించుకోవడంతో బాటు అనేక విషయాలను, ముఖ్యంగా కంప్యూటర్ సాంకేతికాంశాలను తెలుసుకోగలగడం నాకు కలిగిన, కలుగుతున్న లాభం. ఇప్పటివరకూ వ్యక్తిగతంగా నేను బాధపడింది ఏమీ లేదు కానీ ఇంతమంచి వేదికను దుర్వినియోగం చేసుకుంటున్న వారిని గమనిస్తూంటే బాధకలుగుతోంది.
* బ్లాగు ప్రారంభించిన ఉద్దేశ్యం సంపూర్ణంగా నెరవేరిందని చెప్పలేను గానీ నెరవేరుతోందని మాత్రం చెప్పగలను. అయితే నేను అనుకొన్న రూపాన్ని మాత్రం ఇంకా తేలేకపోయాను. సాధ్యమైనంత త్వరలో బ్లాగు మిత్రుల సహకారంతో ఒక సమగ్ర విశేషాల వేదికగా తీర్చిదిద్దాలని ఉంది.
చివరగా ఒక మాట. ' బ్లాగ్లోకంలో సాయం ' మంచి అంశం. ఆ విషయంలో మీ చొరవ అభినందనీయం.

జ్యోతి

మంచిమాట చెప్పారు రావుగారు. బ్లాగుకు సంబందించిన సాయం కావాలంటే బ్లాగు గుంపు ఉంది లేదా నాకు మెయిల్ చేసినా సరే.. నాకు తెలిసింది తప్పకుండా చెప్తాను..

మాలా కుమార్

నేను బ్లాగ్ మొదలు పెట్టిందైతే టైం పాస్ కోసం . ఈ సంవత్సరం ఐతే అది నెరవేరింది . నా బ్లాగ్ నాకు మంచి కాలక్షెప బఠాణి అయ్యింది . అలాగే , నేను రచయిత్రి ని కాకపోయినా ఏదో కాస్త బాగా వ్రాయాలి అనే ఆరాటం వచ్చింది . చాలా మంది బ్లాగ్ మితృలు దొరికారు . ఇంకో లాభం నేను , మా మనవడు విక్రం పొందామండోయ్ ! అది చాలా సీక్రెట్ , మా అమ్మాయి చూడదు అనే ధైర్యం తో చెప్పేస్తున్నాను . అదేమిటంటే వాడి హోం వర్క్ చేసుకున్నాము . అవేమిటో నేను చెప్పను , మీరు కత్తి కదా కనిపెట్టండి , హి హి హి .
బ్లాగ్ లోకము లో అంతా మంచి వారు వుంటారు , సంస్కారవంతులు వుంటారు అనే నా అభిప్రాయం మాత్రం కొన్ని కొన్ని రాతలవలన మారి పోయింది . మంచి చెడు అనేవి ప్రతి చోటా వుంటాయి, మన దారిన మనము పోతున్నా రాళ్ళు విసిరే కుసంస్కారులకు బ్లాగు లు మినహాయింపు కాదు అని తెలిసి మటుకు చాలా బాధగా వుంది .

జ్యోతి

మాలగారు,

బ్లాగ్లోకంలో ఉన్నావారంతా మనచుట్టూ ఉన్నవాళ్లే కదా. మరి ఇక్కడా మంచి, చెడూ తప్పక ఉంటాయి. మనం వెళ్లే దారిలో ముళ్లుంటాయనే ఆదారిన నడవకుంటామా? తప్పుకుని లేదా తొలగించి మన ప్రయాణం సాగిస్తాము. ఇక్కడ చేయవలసింది అంతే..పట్టించుకోవాలసిన పని లేదు.

కథా మంజరి

జ్యోతి గారూ !
ఒక స్నేహశీలి సహకారంతో బ్లాగు రాయడం మొదలెట్టి రెండు నెలలు కాలేదు. నాకు తెలిసిన చమత్కార శ్లోకాలను, పద్యాలను మిత్రులతో పంచు కొంటున్నాను. అచ్చయిన కొన్ని కథలను కూడా ఉంచాను. బ్లాగులో మరిన్ని మంచి విషయాలను పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను.
కొన్ని బ్లాగులు చూస్తూ ఉంటే బాధ కలుగుతున్న మాట అలా ఉంచితే, కొందరి బ్లాగులు ఎంతో స్రుజనాత్మకంగా ఉంటున్నాయి.
బ్లాగర్లకు వచ్చే సందేహాలు తీర్చడానికి మీరు మీ సంసిద్ధతను ప్రకటించడం ముదావహం.

ఒక సందేహం: పికాసో నుండి ఒకకొత్త పోస్ట్ లోకి ఒక సారి రెండు మూడు ఫొటోల కన్నా ఎక్కువ పోస్ట్ చెయ్యడం కుదరడం లేదు. ఎక్కువ ఫొటోలను కానీ, ప్రతులను కానీ ఒక కొత్త పోప్ట్ లోకి ఒకే సారి ఎలా పంపించ గలమో వీలు చూసుకుని చెబుతారా?

జ్యోతి

బ్లాగులకు సంబంధించిన సందేహాలకు ఇక్కడ అడగండి. ఎవరొ ఒకరు సహాయపడతారు..

http://groups.google.com/group/telugublog

GKK

అక్కగారు! మీరు గ్రేట్

శ్రీలలిత

బ్లాగ్ లకు నేను కూడా రాయవచ్చుననే సంగతి నాకు అసలు తెలీదు. కంప్యూటర్ ఆపరేట్ చెయ్యడం మా పిల్లలతో మాట్లాడేంతవరకు మాత్రమే నేర్చుకున్నాను. నాకు చదవడం అంటే ఉండే అభిలాష కొద్దీ అప్పుడప్పుడు తెలుగు వెబ్సైట్లు చూస్తుండేదాన్ని. అలా చూస్తున్నప్పుడే కూడలి కూడా చూస్తుండేదాన్ని. వీళ్ళు కామెంట్లు కూడా చేసుకుంటున్నారే అనుకునేదాన్ని. అన్నీ చదివినట్టే చదివేదాన్ని తప్పితే అందులో నేను కూడా వ్రాయొచ్చు అన్న విషయం నాకు తెలీదు. వాళ్ళంతా ఎవరో వేరే బేచ్ అనుకునేదాన్ని. అలా కూడలి చదువుతున్నప్పుడే ప్రమదావనం గురించి అందులో ఒక టపా వచ్చింది. అది చూసి స్నేహం అంటే ఉన్నఇష్టం కొద్దీ అందులో చేర్చుకొమ్మని జ్యోతీగారిని అడిగాను. ఆవిడ నా వివరాలు అడిగారు. ఇచ్చాను. అంతే.. అందులో మెంబర్ ని అయిపోయాను. ఆ ఉత్సాహంతో పండగ పిండివంటలు చేసుకోవడం గురించి చెప్పాను. అది చూసి జ్యోతీగారు బ్లాగ్ మొదలుపెట్టమని. అందులో ఇదే టపా కాపీ, పేస్ట్ చేసి పెట్టమనీ చెప్పారు. కొత్త విషయం తెలుసుకోవాలనే ఆసక్తి కొద్దీ బ్లాగ్ తయారుచెయ్యడం మొదలుపెట్టి మధ్యలో టెంప్లేట్ కుదరక జ్యోతీగారికి మైల్ చేసి "త్వమేవ శరణం" అన్నాను. అంతే.. ఆవిడ నా బ్లాగ్ ని అందంగా తయారుచేసి ఇచ్చేసారు. ఇంకేం. అప్పటికే వ్రాసి ఉన్నది కాపీ, పేస్ట్ చేసేసాను. ముందుగా భగవంతుణ్ణి ప్రార్ధించుకున్నానండోయ్. నా పోస్ట్ కి వచ్చిన కామెంట్లు చూసి ఇలా కొత్తవాళ్ళు కూడా కామెంట్ చేస్తారా అనుకున్నాను. మళ్ళీ వాళ్ళెవరో, ఇంకా రాస్తే ఏమనుకుంటారో అనుకున్నాను.
అలా అలా మెల్లిగా ఒకటొకటీ రాయడం కాస్త అలవాటయ్యింది. పాటలు, కవితలూ లాంటివే కాకుండా నేను ఛందోబధ్ధమైన పద్యం కూడా ఆచార్య ఫణీందృల సహాయం వలన వ్రాయగలిగానంటే అందుకు కారణం బ్లాగ్ లోకమే. నేను ఇందులోకి అడుగు పెట్టి నాలుగు నెలలే అయ్యింది. ఈ నాలుగు నెలల్లో సాంకేతిక పరమైన కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాను. అంతకన్న ఎక్కువగా మంచి స్నేహితులని సంపాదించుకున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది. ఏ విషయం గురించి అడిగినా చెప్పడానికి బ్లాగ్ మితృలు చాలా మందున్నారు. ఈ బ్లాగ్ మొదలు పెట్టడం వల్ల నేను నా సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటున్నాననే అనుకుంటున్నాను. బ్లాగ్ మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

శ్రీనివాస్

ఎక్కడ చెప్పాలి

తెలుగుకళ

చిన్నప్పటినుండీ రచనలన్నా, కవితలన్నా చాలా ఇష్టం. ఆల్రౌండర్ అనే మాటన్నా డైనమిక్ అనే మాటన్నా మరీ ఇష్టం. అలా కావాలని అలా అనిపించుకోవాలని ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను.
అనుభూతి, స్పందన, వ్యక్తీకరణలు నాకున్న వరాలు. వాటిని పదిలం చేసుకోడానికి బ్లాగు మొదలుపెట్టాను.
రేడియో లోను, పేపర్ల లోను బ్లాగుల గురించి విని నెను కూడా బ్లాగ్ మొదలుపెట్టాలని తాపత్రయపడ్డాను. బ్లాగులు చదవటానికి , వాటిలో కామెంట్లు పెట్టడానికి మొదట్లో ఎన్ని తిప్పలు పడ్డానో. అప్పట్లో ఇంట్లో సిస్టం లెదు. ఒకరకంగా చెప్పాలంటే ముందు బ్లాగు చదవటం , కామెంట్లు పెట్టటం, పరిచయాలు తర్వాత అనుకోకుండా నెట్ సెంటర్ లో బ్లాగులు చదువుతూ డబ్బులు తగలెయ్యడమెందుకని ఙ్ఞానోదయమై పీసీ కొనుక్కోవటం , పగలు రాత్రి పట్తుపట్టి మొత్తానికి నా బ్లాగు తెరవడం ...ఇక సీన్ మొత్తం మారిపోయింది.
నా నేర్చుకునే పిచ్చికి అగ్నికి ఆజ్యమన్నట్టు రోజూ బోల్డన్ని విషయాలు. అగ్గిపుల్ల నుండి అంతరిక్శం దాకా ఎన్నికొత్త విషయాలో.. అబ్బ నాకు బ్లాగరైనప్పటినుండీ తిండిమీద ఆసక్తి తగ్గిపోయిందంటె నమ్మండి. తీరిక దొరికినపుడల్లా రోజూ ఏదో ఒకటి చదువుతూ రాస్తూ ... కంప్యూటర్ ముందే భోజనం. బ్రేక్ ఫాస్ట్.. ఈ మధ్య కాస్త బిజీ అవ్వడంతో బ్లాగింగ్ లో కాస్త గాప్ వచ్చింది.
జ్యోతిగారి ఈ పోస్ట్ చూసాఅక ఇక ఉత్సాహమే ఉత్సాహం... మళ్ళీ కొనసాగించాలి.
నాపేరు
తెలుగుకళ పద్మకళ అయ్యింది.(నాకెంతో సంతోషం గా ఉంది ఇలా పిలిపించుకుంటుంటే.) మన మిత్రులు బ్లాగుల పేర్లతో ప్రసిద్ధమవ్వడం చాలా చాలా గొప్ప విషయం. నిజానికి ఈ పేర్లే మనకు పెద్దపెద్ద ఆస్తులు.
నాకు బ్లాగింగ్ లో, ఇతర రకాలు అన్ని విధాలుగా ఎంతో తోడ్పడుతున్న మితృలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
బ్లాగు మొదలెట్టే టపుడు నెను దాదాపు ౩ నెలలపాటు నెట్ సెంటర్ల చుట్టూ తిరిగి గంటలకొద్దీ సమయాన్ని అయోమయంలో గడిపాను. నా అవస్థ మరెవరికీ రాకూడదనే ఆసక్తి గలవారికి వీలైనంతత్వరగా నాకు తెలిసిన విషయాలు చెబుతున్నాను. నా మిత్రులతో కూడా బ్లాగులు తెరిపించాను.
కొత్త బ్లాగు చూడండి అని ఎవరు మెయిల్ చేసినా వీలైనంత వరకు చూసి అభినందించి ప్రోత్సహిస్తాను.
బ్లాగ్లోకం నందన వనం.
ఈ నందనవనం లో నేను కూడా ఓ చిన్న సుమాన్ని అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

lakshmi perumallu kandepu

hi jyothi garu
nenu blog start cheyatniki karanam nenu anukonna vishayani naku telisina vishayalni etharultho share chesukovalni blog start cheyadam jarigindi
alage nenu anukonna object kooda reach ayyindi ani nenu viswsisthunnanu

జ్యోతి

లక్ష్మిగారు,
మీరు తెలుగులో సులువుగా రాయొచ్చు http://lekhini.org/

Ramu S

jyothi gaaroo,
Nenu, naa sateemani (iddaram jarnalistulam) apmediakaburlu.blogspot.com nirvahistunnam...vijaya dasami roju nunchi. mee blog choodadaaniki andamgaa undi. mee mail id ivvandi..neeno, hemo meeto maatlaadi..maa blognu kooda sundaramgaa cheyaalanukuntunnamu.
thanks
ramu

జ్యోతి

రాముగారు,

ఇది నా ఐడి.. jyothivalaboju@gmail.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008