Wednesday 5 May 2010

పాట (పాత) బంగారం...

ఈరోజు వందల్లో టీవీ చానెళ్ళు ఉన్నాయి. ప్రతీ అంశానికి పదుల్లో చానెళ్ళు. అలాగే మ్యూజిక్ చానెళ్ళు. ఈరోజు యువతరానికి మ్యూజిక్ అంటే అర్ధం లేని పాటలు పాడుతూ, చెవులు బద్దలు కొట్టే (శృతి, లయ లేని ) సంగీతం. అందులో మ్యూజిక్ వీడియోలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కొత్త ఆల్బమ్స్ వచ్చినా తిన్నదరక్క పాత పాటలను కూడా రీమిక్స్ పేరుతొ ఖూనీ చేస్తున్నారు.. ఏమంటే మీకు టెస్ట్ లేదు అంటారు ... కాని ఎప్పటికీ గుర్తుండేవి ,మళ్ళీ మళ్ళీ వినాలనిపించే వీడియోలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి ఫాల్గుని పాఠక్ పాటలు. చూడటానికి అబ్బాయిలా ఉన్నా తియ్యని మధురమైన స్వరం ఆమెది. దానికితోడుగా ఇచ్చే వీడియోలు కూడా సున్నితంగా , సహజంగా ఉండేవి.. ఎన్ని సార్లు విన్నా, చూసినా అలా నిలబడిపోవాల్సిందే.. కొన్ని చూడండి.

యాద్ పియా కి ఆనెలగీ



అయ్యోరామా...




మేరీ చూనర్ ఉడ్ ఉడ్ జాయే..



ఓ పియా...




పల్ పల్ తీరే యాద్ సతాయే...



మై తేరీ ప్రేమ్ దీవానీ...





సావన్ మే...




మైనే పాయల్ హై ఝన్కాయి...

6 వ్యాఖ్యలు:

Anonymous

తెగ ఎంజాయ్ చేశాం ఈ పాటల్ని...మళ్ళీ గుర్తు చేశారు...మరిన్ని మంచి పాటల్ని ఇవ్వండి...

malli

manchi collection.thank u jyothi garu

తారక

naa lanti hindi rani vallu eme cheyaloo

మిరియప్పొడి

పాఠక్ అనుకుంటా పేరు

ఆ.సౌమ్య

ఈ పాటలు చిన్నప్పుడు తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం, మైనే పాయల్ కీ ఝంకాయి పాట నాకు చాలా ఇష్టంగా ఉండేది. పాట వినడం ఒక యెత్తు, ఆ పాట వీడియో చూడడం ఒక యెత్తు....భలేగా తీసేవారు ఆ పాటలని. చూడడానికి, వినడానికి కూడా ఎంతో మధురంగా ఉండేవి.

నరవర నరవర నరవర సురవర సురవర సురవర

కడవెత్తు కొచ్చి కొచ్చి కొచ్చి కొచ్చింది కన్నెపిల్ల

కంటే ఎన్నో రెట్లు మేలు.

జ్యోతి

తారగారు
హిందీ రాకపోతే సంగీతాన్ని ఎంజాయ్ చేయండి.

మిపొ గారు,, సరిచేసానండి, బ్లాగర్ లో నేరుగా రాసేటప్పుడు తప్పులు దొర్లుతాయి.
సౌమ్య..
ఈనాటి రీమిక్స్ పాటల గురించి చెప్పద్దు. చిరాకేస్తుంది.ఖూనీ చేసేస్తున్నారు పాటల్ని..ఈ వీడియోలన్నింటిలో సంగీతం, ధీమ్, యాక్టర్లు కూడా చాలా బావుండేవారు. ఎన్నిసార్లు విన్నా, చూసినా బోర్ కొట్టేది కాదు..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008