Saturday 28 August 2010

e బంధం



చదువులు, ఉద్యోగం కోసం ఉన్నవాళ్లని వదులుకుని విదేశాల్లో ఉన్న కొందరు మిత్రులతో మాట్లాడిన తర్వాత కలిగిన బాధ..  మాకేంటి సంతోషంగా ఉన్నాం అనుకున్నా అందరి మనసుల్లో ఏదో తెలియని దిగులు, ఒంటరితనం..


ఆ వ్యక్తిని చూడగానే పెదవులపై చిరునవ్వు
కళ్లల్లో, మనసులో కనిపించే సంతోషం
బావున్నారా అని మనసారా పలకరింపు
కరచాలనం, ఆలింగనంతో గట్టిపడే అనుబంధం

ఇది ఆనాటి మాటా? ఈనాటి మాటా?
లేక కలల్లో, కళ్లలో దాగిన అందమైన ఊహా?
మనుష్యులు దూరమైనా, సాంకేతికంగా దగ్గరయ్యామని
అందరూ మురిసిపోతున్న ఈ జీవితం ఒక e జీవితం..

వేలమైళ్ల దూరాన ఉన్నా
కనురెప్పపాటులో వినిపిస్తున్న సెల్ ఫోన్లు
వెబ్ కెమెరాద్వారా చూపిస్తున్న కంప్యూటర్లు
మాటలను, రూపాలను సునాయాసంగా
చేరవేస్తున్నా ఏదో తెలియని లోటు, దిగులు

మాటలను మోసుకెళ్లే మొబైల్
మనసును చేరవేసే మెయిల్
ఒక్క మౌస్ క్లిక్కుతో ప్రపంచాన్ని
మన ముంగిట జేర్చే ఇంటర్నెట్

 స్నేహితులతో బలాదూర్‌గా తిరిగిన స్మృతులు
అక్క, తమ్ముడు, చెల్లి కూర్చుని చెప్పుకున్న కబుర్లు
పిల్లల అల్లరి కేరింతలు, పెద్దల ఆజమాయిషీలు
వీటన్నింటిని అచ్చంగా అలాగే మోసుకెళ్లగలదా?

తమని తాము ఆధునికంగా మార్చుకున్నామని
తమ చుట్టూ ఒక అదృశ్య వలయాన్ని ఏర్పరచుకుని
చిరునవ్వులను, ఆప్యాయతాలింగనాలను, పరామర్షలను
సన్నిహితులతో ముచ్చట్లు, పోట్లాటలు , కలయికలు
అన్నీ మరచి.. అందరూ ఉన్నారనుకుని ఏకాకిగా మారుతున్నారా??

13 వ్యాఖ్యలు:

..nagarjuna..

hmmm.....

lekkala panthulu

bavundiraa jyothi,,

annee nijame,,,
bhramalo bathukuthu vaasthavame anukuntunnam

సి.ఉమాదేవి

మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న అనుబంధరాహిత్యాన్ని ఈ e బంధం కొంతవరకు తీర్చగలిగినా ఆత్మీయతను ఆస్వాదింపచేయగల మాటల,మనసుల స్పర్శానుభూతి ప్రత్యక్షంగా లభించినట్లు ఫోను,వెబ్ కెమెరాలలో సాధ్యంకాదుకదా!ఆర్తిని చక్కగా పలికించారు.

విజయభారతి

నిజం చెప్పారు జ్యోతి గారు ఈమద్యే వచిన మావారి కజిన్స్ ని చూస్తే నాకు అలాగే అర్దమైంది
నవ్వు ప్లాస్టిక్ నవ్వులా మాటలు పొడి పొడి గా అక్క చెళ్ళెళ్ళు సైతం పలకరించుకునే తీరు ఒకరితో ఒకరు కనపడని గోడల మద్య బందిలు గా వున్నారని అనిపించింది నాకెందుకు ఈ దుస్థితి అని లేచి వచ్చెసాక ఊపిరాడినట్లైంది.

జ్యోతి

పంతులుగారు, భ్రమలో అని బ్రతకడంలేదండి. వాళ్లకు తప్పని పరిస్థితి అది. అందరికి దూరంగా ఉండక తప్పదు. వారి బాధ మాత్రం చెప్పుకోలేనిది. ఏమీ చేయలేరు.

Sensitive Fragrance

yenduku cheyaleru jyothi garu,dabbu meedi aasa ,manishini swadesani ki raniyadam ledu,yendukante ikkada jeetalu takkuva kada,dollars tho polchite...kani kalam marindi yuvataram kevalam pai chaduvalaki matrame videsalaku veltunnaru,naku telisina vallalo chaduvulu poortaina tarvata mana rashtrani ke vastunnaru:)idi subha parinamam kada?

వేణూశ్రీకాంత్

"అందరూ ఉన్నారనుకుని ఏకాకిగా మారుతున్నారా??" ఈ ప్రశ్న నాకు నేను ఈ మధ్య చాలా సార్లు వేసుకున్నానండీ...

శ్రీలలిత

పొట్ట చేత పట్టుకుని ఇదివరకు పల్లెల నుండి పట్నాలకు వలస వస్తే, ఇప్పుడు దేశాలే వలస పోతున్నారు. కాలంతో వచ్చే మార్పును తలవంచి అనుసరించక తప్పదు. దానితోపాటే అన్ని రకాల అనుభవాలూను.

Anonymous

not true.

జరిగిపోయిన కాలాన్ని జరుగుతున్న జరగబోయే కాలంతో పోలిస్తే మీలానే అనిపిస్తుంది.

ఈ రోజులు కచ్చితంగా రేపు మంచిగానే అనిపిస్తాయి.

Afsar

చిరునవ్వుని మరిచిపోవడం కన్నా శాపం లేనే లేదు.
మీ రచనలో ఆ చివరి రెండు ప్రశ్నలూ ఎప్పుడూ నన్ను వెంటాడ్తాయి.
E- బతుక్కీ, ఈ-జీవితానికీ మధ్య తేడాల్ని ఇప్పుడయినా మనమ వెతుక్కోవాలి.

వీర

e- జీవితమే బాగుంది. నిజ జీవితం లో ఈ రోజులలో అందరూ బాగా మారి పోయారు. అన్నదమ్ములకి, అక్క చెళ్లెలకి ఆలోచనా విధానం లో బాగా గాప్ వచ్చింది. కలసిన మొదలు కొని ఎక్కడ తగవులు వేసుకుంటారో అని పెద్ద వాళ్ళకు ఒకటె టెన్షన్. ఆత్మీయత,అనుబంధం,ప్రేమ, స్పర్శానుభూతి ఇవ్వని ఉత్త మాటలు. నేను చలా సంవత్సరాల తరువాత మా అక్క పిల్లలను చూడటానికి పోతే, నాతో నాలుగు మాటలు మాట్లడటానికి వారికి సమయం లేదు. వీళ్ళని చిన్నపుడు ఎన్నొ సం|| స్కూల్ కి వదలివచే వాడిని . ఎంతో బాగా చూసుకునే వాడిని. కాని వారికి మన మీద కన్నా రోజూ టి.వి లో కనిపించే బ్రహ్మానందం, సునీల్ లాంటి కామేడి నటుల మీద ఉన్న ప్రేమతో పోలిస్తె నామిద 2% కూడా లేదని పించింది. ఎపూడు చూసినా చదువు, లేక పోతె టి.వి. లో సినేమా ప్రొగ్రాంలు కనీసం ఊరికి పోతుంటె టాటా చెప్పటానికి కూడా బయట వరకు రాలేదు. ఇక పెద్దలు, వాళ్ళ పిచ్చి లో వాళ్ళు ఉంటారు. వారి పిల్లలని ప్రపంచం లో అందరికన్నా ఎక్కువ గా అభివృద్ది చేయాలని ఎంత సేఫటికి చదువుల మీద చర్చ, లేక పోతె ఎక్కడ ఇల్లు కొంటె ఎంత లాభం వస్తుంది. ఎవరు ఎనత సంపాదించారు. ఈ బోడి భాగ్యానికి మనం అనుబంధం, ఆత్మీయత,ప్రేమ అని పేరు పెట్టుకొని తెగ ఫీలౌతూ ఉంటాము. వీటన్నిటి కాంపేన్సేట్ చేయటానికి రోజులలో ఒక ఈ మైల్ చాలు లేక పోతే ఒక ఐదు నిముషాలు ఫోన్లో ప్రపంచం లో ఉన్న ప్రేమను కురిపించే విధంగా మాట్లడితే సరి. అందరికి సంతోషం.
మా అమ్మానాన్నలను చూడటానికి వేళ్లే టప్పుడు నేను ఒక్కడినే పోతాను. వారు వయసు లో పెద్దవారు కనుక మనతో ఎవో వొంటరిగా మాట్లాడలను కుంటారు. ఎంతమంచి కోడలైనా కొన్ని విషయాలు, నా భార్య వచ్చినపుడు చేప్పటానికి సంకోచిస్తారు.ఇది నేను చలా సార్లు గమనించాను. అదే కాక నేను మా అమ్మానాన్నలకి కాళ్ళు పిసకటం, ఇంట్లో బూజు దులఫటం, ఇల్లు కడగటం,పాత పుస్తకాలు సర్ది పెట్టటం ఇటువంటి పనులు ఎన్నో ఉంటాయి, వాటిని చేసి వస్తాను. అవి చేయటానికి పని మనుషులు ఉన్నా, మా అమ్మనాన్నలు ముసలి వాళ్ళు, వంటరిగా ఉంటారు, కనుక పని వాళ్ళకి వాళ్ళు ఎంత చెప్పిన ఎదో పైపైన అలా చేసి వేళతారు. దానిని చూసి ముసలి తల్లిదండృలకి మన మాట ఎవరు వినటం లేదు అని, శక్తి తక్కువైన తరువాత ఇల్లుని సరిగా పెట్టుకోలేక పోతున్నామని దిగులు పడతారు. నేను ఆ దిగులిని పోగొటి వస్తాను. ఈ పనులని నేను చేసెది నా భార్య చేయటం చూస్తె మీ అమ్మానాన్నల కైతె చేస్తావు, నాకు ఎక్కడ చేయమంటుందొ అని భయం వలన ఆవిడని పుట్టింటికి పంపి నేను ఈ పనులన్నిటిని చేయటానికి రంగంలో దిగుతాను.
----------------------------------
ఇంతకు మించి నేను జీవితం లో అమ్మానాన్నలకి ఎమీ చేయలేను అని నాకు అర్థమైంది.

జ్యోతి

a2zdreams గారు,
నేను చెప్పింది ఈనాటి మాట. అమెరికాలో ఉన్న మా చుట్టాల పిల్లలు,స్నేహితులు చెప్పిన మాటలే ఇవి. ఆధునికత కొంతవరకు ఈ దూరాన్ని తగ్గించగలిగినా ఎప్పుడూ, ఏదో వెలితి ఉంటుంది. అక్కడున్నవాళ్లకైనా, ఇక్కడున్నవాళ్లకైనా..

వీరగారు, కొన్ని లేదా చాలా కుటుంబాలలో మీరు చెప్పినట్టే ఉంది. ఒప్పుకుంటాను. అడ్జస్ట్ అవ్వక తప్పదు.

రవిశేఖర్ హృ(మ)ది లో

పరుగుతో అలసిన జీవితాలు ఏమి కోల్పోతున్నాయో కవితలో బాగా వర్ణించారు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008