Thursday 20 October 2011

ఆన్‌లైన్‌లో ఆకాశవాణి


ఆన్‌లైన్‌లో ఆకాశవాణి


సంగీతం మన జీవితంలో ఒక భాగం. ఇది అందరూ ఒప్పుకునే సత్యం.. అది శాస్త్రీయ సంగీతమైనా, భక్తి సంగీతమైనా, సినిమా పాటలైనా మనసును ఉల్లాసపరుస్తాయి అని ఒప్పుకోక తప్పదు. ఉదయం ఆరు గంటలకే భక్తిసంగీతంతో నిద్ర లేపే రేడియో లేదా ఆకాశవాణి భారతీయులు అందరికీ సుపరిచితమే. కొన్నేళ్ల క్రింద ఒక చెక్కపెట్టెలోనుండి మాటలు, పాటలు వస్తుంటే వింతగా చూసేవారు. కాని నేడది చాలామందికి జీవితంలో ఒక భాగమైపోయింది. ఒక టేబిల్ మీద ఉండే పెద్ద రేడియో పెట్టె నేడు మొబైల్ ఫోన్, ఇంటర్‌నెట్ ద్వారా కోట్లాదిమందిని అనుక్షణం వెన్నంటే ఉంటుంది. పాటలు వింటూ పని చేసుకోవడం ఒక వ్యసనంలా మారింది అని చెప్పవచ్చు. మధురమైన సంగీతంతో మనసును సేద తీర్చి ఆహ్లాదాన్ని ఇచ్చే మధురమైన వ్యసనం ఇది. అందుకే ఈనాడు ప్రతీ మొబైల్ ఫోన్‌లో FM రేడియో తప్పకుండా ఉంటుంది. ఈ కారణంగానే ఈ మధ్య కాలంలో ఎన్నో FM రేడియో చాన్నెళ్లు, ఇంటర్‌నెట్ రేడియోలు పెరిగిపోతున్నాయి అని చెప్పవచ్చు. విస్తృతంగా పెరిగిన అంతర్జాల వినియోగంతో కొందరు ఔత్సాహికులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త కొత్త రేడియో ఛానెళ్లు మొదలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. బస్సులో వెళుతున్నా, కారులో వెళుతున్నా మొబైల్ ద్వారా పాటలు వింటున్నారు చాలా మంది. ఈ FM రేడియోలు మన దేశంలోనే అందుబాటులో ఉన్నాయి. కాని విశ్వవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులైన తెలుగువారు తమ కంప్యూటర్ ద్వారా వివిధ రేడియోల ద్వారా తెలుగు పాటలు వినే అవకాశం ఉంది.


దేవరాగం విత్ భారతి, నేను ప్రతీక, ముద్దుగా గుడ్‌మార్నింగ్ చెప్పే సునయన, క్రిష్, ఫాహద్, బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్... వీళ్లందరూ నాయకులు కారు, సినీ ప్రముఖులు కారు ఐనా ఈనాడు ఎంతోమందికి పరిచయం. రోజూ వీరి మాటను అందరూ వింటున్నారు. ఆనందిస్తున్నారు. ఎదురుచూస్తున్నారు.. ఎవరు వీళ్లు?? తెలుగు FM చానెల్స్ ద్వారా ఇరవై నాలుగు గంటలూ తమ మాటలతో , మధురమైన పాత కొత్త పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అందుకే రోజు రోజుకు రేడియో వినియోగం పెరిగిపోతుందని చెప్పవచ్చు. మొబైల్ ఫోన్ మాత్రమే కాదు. చిన్న చిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్లలో కూడా రేడియో ద్వారా మంచి పాటలను వినిపిస్తున్నారు. మరి హైదరాబాదులో మాత్రమే వినగలిగే తెలుగు FM చానెళ్లు రేడియో మిర్చి, రేడియో సిటీ, రెడ్ FM, రెయిన్‌బో FM, వివిధభారతి మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్లో ఇక్కడ http://www.voicevibes.net/ వినొచ్చు. కానీ ఖర్చులేదు. సభ్యత్వం తీసుకునే పని లేదు. ఇదేకాక తెలుగు పాటలు వినిపించే రేడియో ప్లేయర్లు లభించే సైట్లు కూడా బోలెడు ఉన్నాయి.


తెలుగువన్ వారు నిర్వహిస్తున్న http://www.toucheradio.com/ లో అమెరికా, లండన్, ఇండియా, ఆస్ట్రేలియా సమయాలకనుగుణంగా రేడియో ఏర్పాటు చేయబడింది. ఇందులో live radio కూడా ఉంది. అలాగే TORi లో రేడియో పాటలు మాత్రమే కాకుండా ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఇళయరాజా, పాట పాటలు, కొత్త పాటలు మొదలైన పేర్లతో ఇతర ప్రోగ్రాంలు కూడా అందిస్తున్నారు. ఈ మధ్యే మొదలైన మరో రేడియో మనసుతో manasutho.com .. ఈ రేడియోలో మధురమైన పాటలు ఆగకుండా వినిపిస్తూనే ఉంటారు. అంతే గాక యుగళగీతాలు, సోలో గీతాలు, ప్రేమ గీతాలు అంటూ వివిధ విభాగాలు కూడా పొందుపరిచారు నిర్వాహకులు. మరో తెలుగు రేడియో ( ఇది Internet Explorer లో మాత్రమే పని చేస్తుంది) http://livetvchannelsfree.in/teluguradio.html.. ఇక్కడ తెలుగుతో బాటు మరి కొన్ని భారతీయ బాషలలోని పాటలు వినే అవకాశం ఉంది. నెటిజనులలో బాగా ప్రాచుర్యం పొందిన మరో రేడియో http://www.radiokhushi.com/ ఇందులో తెలుగు, హిందీ బాషలలో రేడియోలు ఉన్నాయి. తెలుగు విభాగంలో మీరు కోరిన పాటలు, హిట్ పాటలు, భక్తి సంగీతం, అభినందనలు మొదలైన వర్గాలుగా పాటలను అందిస్తున్నారు. తెలుగు పాటలను అందించే మరో రేడియో http://www.telugufms.com/ ఇందులో రేడియో మాత్రమే కాక ప్రముఖ సంగీత దర్శకులు పాటలు కూడా అందిస్తున్నారు. ఇందులో ఇరవైకి పైగా వివిధ విభాగాలు ఉన్నాయి. మరో కొత్త రేడియో చానెల్ http://radiojosh.com/ ఇందులో తెలుగు హిందీ పాటలు వినొచ్చు .. ప్రతీ ఇంట్లో కంప్యూటర్ ఉన్న ఈ రోజుల్లో అంతర్జాల అనుసంధానంతో ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా తెలుగు పాటలు వినే అవకాశం ఉంది . అది కూడా పైసా ఖర్చు లేకుండా... అంతే కాకుండా రాగా, చిమట మ్యూజిక్ సైట్లలో కూడా తెలుగుపాటల ప్లేయర్లు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే కంప్యూటర్ తెరిచేసి హాయిగా తెలుగు పాటలు వింటూ ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పనులు చేసుకోండి..

10 వ్యాఖ్యలు:

శ్రీ

మంచి వ్యాసం అండీ! మా రేడియో జోష్ ఇంకొన్ని రోజుల్లో అందరి ముందుకు రాబోతుందండీ!

RAMAKRISHNA

meru chpina free radio gurunchi us lo una telisina vallu andrki chepututuna manchi sangati cheparu jyothi garu

srinivasrjy

ఈ మధ్య ఏ బ్లాగులో చూసినా అ రోజు బ్వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలే పోస్టులుగా ఉంటున్నాయి... ఏది ఎవరి తప్పో తెలీదు.. కనీసం ఇది ఫలానా పత్రికనుండి, ఫలానా రచయితది అని చెప్పగలిగితే చాలు..

వనజ తాతినేని/VanajaTatineni

Good Information.Thank you very much Jyothi garu

శశి కళ

నాకు కూడా రెడియొ అన్టె చాలా ఇష్టం...
దాని వలనె మాకు చిన్నప్పుడు అన్ని విషయాలు
తెలుసుకున్నాము....nice post

Disp Name

Ante Kaadandoi Internet Radio koodaa unnaai. ivi chooddaaniki maamulu radiolla untaayi. wifi access tho internet ki connect chesukovacchu. 'velaadi' internet radio lani vinavachhu( Computer avasaram lekunda) Interested ones can take a look at SAGEMCOM VAARI RM50 MODEL ee linkulo choodavachhu. Idi standard FM radio koodaanu.

http://www.sagemcomdigital.co.uk/digital-audio/wifi-radio/sagemcom-rm50-digital-radio/

Vineela

aah you are missing world's first telugu radio in internet TORI:)

జ్యోతి

శ్రీ.. అభినందనలు ..

రామకృష్ణగారు ధన్యవాదాలు

శ్రీనివాస్ గారు,, నా బ్లాగులో నేను పెట్టే పత్రికా వ్యాసాలు నేను రాసినవే. నేను ఇచ్చే లింకులో అది ఏ పత్రికో స్పష్టంగా ఉంటుంది. మీరు గమనించలేదేమో.. మిగతా బ్లాగుల సంగతి నాకు తెలీదు..

వనజ, శశికళ.. ధాంక్స్

జిలేబిగారు, మీరించ్చిన రేడియో లింక్ చూస్తానండి. దాంక్స్..

వినీల.. నేను ఆ రేడియో గురించి రాసానుగా. తెలుగువన్ అని లింక్ ఇచ్చాను. టోరీ అని రాయలేదు అంతే.. చూడంఢోసారి..

Ashok Filmy

మంచి వ్యాసం అండీ!

jyothi

reallyy good information u given jyothi garu.. thanq so much for sharing ..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008