Saturday 10 August 2013

ఉష మరువం - పుస్తకావిష్కరణ



తెలుగు బ్లాగుల్లో అడుగిడిన నాటినుండి తనదైన ముద్ర వేసుకుని బ్లాగ్లోకంలో మరువపు సుగంధాలను వెదజల్లిన బ్లాగరు ఉష మనందరికి పరిచయమే. నిత్యజీవితంలోని సంఘటనలను, భావోద్వేగాలను, జ్ఞాపకాలను, మదిలోని అల్లరి, అలజడులను అందంగా కవితారూపంలో మనందరిని అలరించిన ఉష బ్లాగులోని కవితలు కొన్ని ఏర్చికూర్చి ఒక 'మరువం' కవితా సంకలనంగా తయారుచేయించింది.  ఈ ఏడాది సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యశీలి అయిన వాళ్ల నాన్నగారికి అనురాగ పురస్కారంగా  అంకితమివ్వబడిన ఈ పుస్తకం  ఈ నెల ఏకాదశినాడు ఆయన చేతుల మీదుగానే  విడుదల చేయబడింది.   

ఈ సందర్భంగా ఉష  ఆత్మీయ మిత్రులైన మరువం మైత్రీవన ప్రేమికులకోసం తన పుస్తకాన్ని హైదరాబాదులో ఈ నెల అంటే ఆగస్టు 13వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు ఆవిష్కరణ చేయాలని సంకల్పించింది.. ఈ సంధర్భంగా అందరికి ఆహ్వానం. ఉష ప్రయాణ హడావిడిలో ఉండడం వలన ఈ బాధ్యత నేను తీసుకోవడం జరిగింది.  ఈ వేడుకకు రాగలవారు నాకు మెయిల్ చేయగలరు. మిగతా వివరాలు తెలియజేస్తాను.. jyothivalaboju@gmail.com




"ఎద చుట్టూ అదృశ్యం గా అలుముకున్న ఆవరణ
   మునుపెన్నడూ ఎరుగని ఆఘ్రాణింపు తో కవ్విస్తుంది
     అక్షరాలు ఊపిరి పోసుకుంటూ నన్ను పీల్చుకుంటాయి
                                              వ్యక్తానువ్యక్తంగా వేయి ఆవరణలు 
వేచి ఉన్నాయి కల/పు/వేటు దూరాన"
 
 
 

2 వ్యాఖ్యలు:

జాన్‌హైడ్ కనుమూరి

congratulations

ఆ.సౌమ్య

that is excellent ! congrats to Usha garu!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008