Tuesday 28 April 2015

ధీర-3 - అంతులేని కధ



“ధీర” అనగానే... ధీరురాలు, శూరురాలు, వీరపత్ని లేదా చత్రపతి శివాజీ తల్లి లాగ వీర మాతేమో, అలాంటి characterizations కే ఆ ధీర అనే మాట వాడాలేమో అనుకుంటాం. ఇప్పటిదాకా మన సినిమాల్లో చూపించేది అలాగే. కత్తిపట్టి యుద్ధం చెయ్యగలిగే కోవలో ఉన్నవాళ్ళు సరే. కత్తిపట్టకుండా తామే కత్తై బ్రతుకు సాగించేవాళ్ళని కూడా “ధీర” అనవచ్చు. ధీర అంటే ధైర్యవంతురాలు, విశ్వాన్ని ఒడిసి పట్టుకునే ఆత్మవిశ్వాసం గలది. రామాయణంలో సీత కత్తి పట్టి యుద్దం చెయ్యలేదు, బాణాలు వేసి శత్రువుని తుదముట్టించలేదు. కాని తనని అపహరించిన రావణుడిని తన ఆత్మవిశ్వాసంతో, మాటలతో భయపెట్టిన దైర్యవంతురాలు, రామాయణానికి గ్రంధనాయకి సీత.. అందుకే ఆమె ధీర. 


సామాన్యుల జీవితాలలో మరెన్నోకష్టాలు, నష్టాలు, ఆకలి, డబ్బు లేమి, బ్రతుకు భయం, అవసరాలు, వ్యసనాలు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో వుంటాయి. వీటి బారిన పడి ఎంత మంది స్త్రీ, పురుష జీవితాలు పెనుగాలి లో చిక్కి రాలిపోయిన పువ్వుల్లా రాలిపోతున్నాయో.. మళ్ళీ వాళ్ళ జీవితాన్ని వెనక్కి తీసుకొచ్చుకోలేనంత !!!


ఇటువంటి కష్టాల మధ్య, ఒకపూటే తిన్నా కూడా మళ్ళీ అర్ధాకలే అనే నిరాశా నిస్పృహల మధ్య పెరిగిన జయమ్మ, కన్న తల్లి దూరమయి, కన్న తండ్రి మరో పెళ్ళి చేసుకుని అందులో కొట్టు మిట్టాడుతూ వుంటే తాను వంటరిదయి పోయిన జయమ్మ, తాతయ్య, నానమ్మ చేతిలో చాలీ చాలని జీవితాన్ని జీవించిన జయమ్మకు అక్షర జ్ఞానం లేదు. కానీ పుట్టుకతోనే విచక్షణ, అవగాహన తద్వారా విజ్ఞానం అన్నది కొంతమందికి వస్తుంది అనీ పెద్దలు చెప్తుంటారు, అది జయమ్మని చూస్తే నిజమే అనిపిస్తుంది. తన వారు లోనయిన ప్రలోభాలకు, చేసిన తప్పులకు (కారణాలేమైనా గానీ) కుటుంబం అనేది విచ్చిన్నమై తానెలా వంటరిదైపోయిందో అర్ధంచేసుకుంది. అటువంటి దుస్థితి తన జీవితానికి ఇకనైనా వుండకూడదనీ, తన బిడ్డలు తనలా అలమటించకూడదనీ ఆమె చేసిన.. ఇంకా చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఆమెని ఈ రోజు "ధీర" గా నిలబెట్టాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న ఈ జయమ్మ ఒక ధీర అని చెప్పడంలో సందేహమే లేదు.


ఈ ధీర మాలిక పత్రిక మే నెల సంచికలో ...

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008