Friday 23 October 2015

సృజనస్వరం



జ్యోతిగారు మీరు సృజనస్వరం ప్రోగ్రామ్ లో గెస్ట్ గా రావాలండి...

నేనా??.. ఎబ్బే!!! నాకంత సీను లేదు. సినిమా అస్సలే లేదండి.. ఏదో నాకిష్టమైనవి నేర్చుకుంటూ, కాసిన్న రాసుకుంటూ, కాసిన్న వండుకుంటూ కాలం గడిపేస్తున్నాను.. ఐనా మురళీకృష్ణగారు మీరు రచయితలను పరిచయం చేస్తున్నారు. ఏదో చిన్న చిన్న వ్యాసాలు తప్ప.నేను రచయితను కాదుగా.. కథలు రాయను. కవితలు రాయను. ఒక్క బహుమతి కూడా రాలేదు.. ఒక్క పుస్తకం కూడా అచ్చేయలేదు.. మీ గెస్ట్ లిస్టులో నేను సరిపోనండి..

అలా ఎందుకనుకుంటారు.. రచయిత అంటే కథలు, నవలలు రాసేవాళ్లు. పోటీల్లో బహుమతులు సంపాదించేవారే కాదు. మీరు రైటర్ ఎందుకు కాదు.. 

ఏమోనండి..చూద్దాం... ఎప్పుడైనా ఏదైనా పుస్తకం ప్రింట్ ఐతే కాస్త అర్హత వచ్చిందని అనిపిస్తే తప్పకుండా వస్తాను.
ఇలా రెండేళ్ల క్రింత నుండి కస్తూరి మురళీకృష్ణగారు అడుగుతూ ఉన్నారు.. ఎలాగైతేనేమి లాస్ట్ ఇయర్ ఇదే టైమ్ లో అనుకుంటా ఎలాగూ ఒక పుస్తకం (తెలంగాణ వంటలు - వెజ్) రాసాను కదా అని సృజనస్వరంలో పాల్గొంటానని ప్రోగ్రామ్ రికార్డింగ్ కూడా చేసాను. కాని ముందే చెప్పా. నాకు రాయడం తప్ప మాట్లాడ్డం రాదు ముఖ్యంగా మైకు ముందు అన్నా. పర్లేదు మిమ్మల్ని నేను మాట్లాడేలా చేస్తాను అని నమ్మకంగా చెప్పారు మురళీకృష్ణగారు.. ఇక ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుతూ గంట ఎలా గడిచిపోయిందో తెలీలేదు. దీనికోసం నేను ప్రిపేర్ అయ్యిందేమీ లేదు. జస్ట్ అలా మాట్లాడేసాను.. కాని తెల్లారి ఏం మాట్లాడిందీ గుర్తులేదు..

సో ఇవాళ రాత్రి తెలుగు వన్ వారి టోరి రేడియోలో సృజనస్వరంలో నా గురించి నేను మాట్లాడింది వినండి మరి.. నా గురించి చాలామందికి తెలియని చాలా విషయాలున్నై ఇందులో.. ఈ ప్రోగ్రామ్ లో నేను చేస్తానన్న విషయం ఆల్రెడీ విజయవంతంగా పూర్తి చేయడమైంది. అదేంటో తెలుసుకోండి..


నా ఫ్రెంఢ్స్ కి చిన్న పరీక్ష:
సుమారు ఐదారేళ్లుగా నాకు పరిచయమున్న కస్తూరి మురళీకృష్ణగారు అవసరమైనవేళ ఎన్నసార్లు నాకు సాయం చేసి ప్రోత్సహించారు.. ధైర్యం చెప్పారు. కాని నన్ను అతిధిగా పిలిచినందుకైనా నేను ఆయన్ని గురించి గొప్పగా మాట్లాడకుండా కేర్ నాట్ అన్నట్టు ఒకచోట మాట్లాడాను.. (ప్చ్.. భయం లేకుండా నిజం మాట్లాడటం నాకున్న మంచి దురలవాటు...)అదేంటో కనుక్కుని ఇక్కడ కామెంట్ పెట్టిన మొదటి వ్యక్తికి నా ఫేస్బుక్ కార్టూన్స్ పుస్తకం ఉచితంగా పంపిస్తాను...

October 23rd, 2015 at
11.30 pm - 12.30 am (IST),
2 pm - 3 pm (EDT),
7 pm - 8 pm (UK),
10 pm - 11 pm (UAE).


Tune in to TORi live,

http://www.teluguoneradio.com/

http://www.teluguone.com/devices/


1 వ్యాఖ్యలు:

raghava

joythi garu vinnanu,chala chakkga mataldaru.me matalu vintunte edo teliyani andam.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008